Animalia Classification – ఆనిమేలియ- వర్గీకరణ

Animalia Classification Animalia Classification

ఇవి మొట్టమొదటి జంతువులు అని అర్థంవచ్చే Animalia Classification (ప్రోటోస్ = మొదటి; జూన్ : జంతువు) గ్రీకు పదాల నుంచి ప్రోటోజోవా అనే పదాన్ని పదకల్పన చేసి గోల్డ్ఫస్ 1817లో మొదటిగా ఉపయోగించారు. వాన్సీబాల్డ్ (1845), ఇవి ఏకకణ జీవులని గుర్తించాడు. దాదాపు 31,500 జాతుల జీవులను గుర్తించారు.

‘ఉపరాజ్యం : మెటాజోవా – Animalia Classification

ఇవన్నీ బహుకణ జీవులు మరియు నిజ కేంద్రకం గల జీవులు. ఇవన్నీ పరపోషక జీవులే. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని ఆధారపడతాయి. వీటిలో ఆహారం అంతర్గ్రహణం మరియు జీర్ణక్రియ అంతా శరీరంలోని అంతరకుహరంలో జరుగుతుంది. మెటాజోవన్లను 3 శాఖలుగా విభజించారు. అవి (1) మీసోజోవా (2) పారాజోవా (3) యూమెటాజోవా.

శాఖ 1: మీసోజోవా

ఈ విభాగంలోని జీవులు కణాలను కలిగి ఉండి స్టీరియోబ్లాస్టులా లాంటి నిర్మాణాలతో ఉండి ఉపరితలంలో దేహకణాలను కలిగి అంతర్గతంగా ప్రత్యుత్పత్తి (లైంగిక) కణాలను కలిగి ఉంటాయి.

శాఖ 2: యూమెటాజోవా

ఈ విభాగంలోని జీవులన్నీ బహుకణ జీవులే. ఈ జీవులు అనేక అవయవాలను కలిగి ఉండి నోరు మరియు జీర్ణనాళాన్ని కలిగి ఉంటాయి. ఈ జీవులను రెండుశ్రేణులుగా విభజించారు. అవి (1) రేడియేటా (2) బైలటేరియా.

శ్రేణి (1) రేడియేటా

ఇవి వలయ సౌష్టవం గల ద్విస్తరిత (diploblastic) జీవులు. నిడేరియా అనే వర్గాన్ని ఈ శ్రేణిలో చేర్చారు. జీర్ణనాళం బాహ్యంగా నోరు ద్వారా తెరచుకొంటుంది. పాయువును కూడా కలిగి ఉంటాయి. బాహ్యచర్మం నుంచి మధ్యస్త్వచం ఏర్పడుతుంది. ఇది ప్రాథమికంగా అభివృద్ధి చెందే కణజాలంతో ఏర్పడుతుంది.

 శ్రేణి (2) బైలటేరియా

ఇవి ద్విపార్శ్వ సౌష్టవం గల త్రిస్తరిత జీవులు. వీటిలో కూడా అంతరచర్మం నుంచి మధ్యస్తరం ఏర్పడుతుంది. వీటిలో అవయవాలు అభివృద్ధి చెంది జీర్ణవ్యవస్థ బాగా పూర్తిగా ఉండి పాయువును కలిగి ఉంటుంది. ఇది రెండు డివిజన్లుగా విభజింపబడినది. అవి డివిజన్ 1. ప్రోటోస్టోమియా (ప్రోటో = మొదట, స్టోమమ్ = నోరు)

ఇవి ఆది ఆంత్రరంధ్రం నోరుగా మారిన బహుకణ జీవులు. వీటిలో సర్పిలాకార మరియు నిర్ధారిత విదళనాలు జరుగుతాయి. దీనిని 3 సబ్ డివిజన్లుగా విభజించారు. అవి 91) ఏసీలోమేటా (2) మిథ్యాసీలోమేటా (3) షైజోసీలోమేటా

సబ్ డివిజన్ 1. ఏసీలోమేటా: ఇవి దేహకుహర రహిత జీవులు. దేహకుడ్యానికి, అంతరాంగాలకు మధ్య ప్రదేశం మీసెంకైమ్ లేదా మృదు కణజాలతో నిండి ఉంటుంది.

సబ్ డివిజన్ 2 : మిథ్యాసీలోమేటా: వీటిలో దేహకుడ్యానికి, ఆహారనాళానికి మధ్య కుహరం ఉంటుంది. కాని ఇది మధ్యస్త ఉపకళతో ఆవరించబడి ఉండదు. కాబట్టి అది నిజమైన సీలోం కాదు. ఉదా: నెమెటోడా వర్గం.

సబ్ డివిజన్ 3: షైజోసీలోమేటా: వీటిలో దేహకుహరం షైజోసీలిక్ రకానికి చెందిన నిజమైన సీలోం. ఇది మధ్యస్త్వచం చీలడం వల్ల ఏర్పడుతుంది. ఉదా: అనెలిడా, ఆర్థ్రోపొడా, మలస్కా వర్గాలు.

డివిజన్ 2: డ్యుటిరోస్టోమియా (డ్యుటిరో = ద్వితీయ, స్టోమమ్ = నోరు): ఇవి ఆది ఆంత్రం రంధ్రం పాయువుగా లేదా దేహ ఆదిఆంత్ర రంధ్రానికి సమీపంలో పాయువు ఏర్పడిన యూసీలోమేట్లు. తరవాత నోరు ఆదిఆంత్ర రంధ్రానికి దూరంగా వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. వీటిలో వలయ విదళనాలు, అనిర్థారిత విదళనాలు జరుగుతాయి. దీనిలో ఎంటిరో సీలోమేటా అనే సబ్ డివిజన్ను చేర్చారు.

సబ్డివిజన్: ఎంటిరోసీలోమేటా: ఈ జీవులలో నిజమైన దేహ కుహరం సీలోమ్ ఉంటుంది. ఇది ఆంత్రకుహరికా సీలోమ్. ఇది ఆదిఆంత్రం నుంచి ఏర్పడుతుంది. ఉదా: ఇఖైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా.

శాఖ : పారాజోవా: ఇవి స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు. ఈ రాజ్యంలో పొరిఫెరా అనే ఒక వర్గం చేరి ఉంది.

వర్గం 2: మీసోజోవా: ఈ వర్గంలో దాదాపు 50 జాతులను గుర్తించారు. ఈ జీవులు పురుగులలాగా చిన్నగా ఉండి సముద్ర అకశేరుక జీవులలో అంతర పరాన్నజీవులుగా నివసిస్తాయి. శరీరం శైలికలతో కూడిన ఒకే ఒక పొరతో ఏర్పడి ఉంటుంది. జీర్ణకణాలు మరియు లైంగిక కణాలుంటాయి.

వర్గం 3: పొరిఫెరా: ఈ వర్గంలో ‘స్పంజికలు’ (Sponges) అనే అతి ప్రాచీనమైన మొక్కలలాగా కనిపించే జంతువులను చేర్చారు. ఇవి సముద్ర తీరాలలోను, అగాధ జలాల్లోను, అథఃస్థలానికి అంటిపెట్టుకొని నిర్జీవంగా ఉన్నట్లు కనిపిస్తాయి. కొన్ని మంచినీటిలో కూడా నివసిస్తాయి. ‘రంధ్రాలు కలిగిన జీవులు’ అనే అర్థం వచ్చే (పోరస్ రంధ్రం; ఫెర్రి = కలిగి ఉండటం) లాటిన్ పదాలనుంచి గ్రాంట్ 1836లో మొదటిసారిగా ‘పొరిఫెరా’ అనే పదకల్పన చేశారు. ఈ వర్గంలోని స్పంజికలను ‘పేరాజోవా’ అనే శాఖలో చేర్చడం జరిగినది. వీటిలో దాదాపు 4500 జాతులను గుర్తించడం జరిగినది. దాదాపు 8,000 జాతుల వరకు ఇప్పటి గుర్తించారు.

ఉదా : స్పంజికలు, ల్యూకోసాలేనియా, స్కైఫా, యూస్పాంజియా మొదలైనవి.

వర్గం 4: సీలెంటిరేటా (నిడేరియా)

1847వ సంవత్సరంలో ల్యూకార్ట్ అనే శాస్త్రవేత్త ‘సీలెంటిరేటా’ అనే వర్గాన్ని ఏర్పరచారు. ఈ సిలెంటిరేటా వర్గంలో స్పంజికల్ని, దీనోఫొరా జీవుల్ని కూడా చేర్చారు. ఈ వర్గ జీవులలో కణజాల స్థాయి ఉంటుంది. ఇవన్నీ ఎక్కువగా సముద్ర జీవులు. కొన్ని మాత్రమే మంచినీటిలో నివసిస్తాయి. ఈ వర్గంలో దాదాపు 10,000 జాతుల జీవులున్నాయి. హైడ్రాలు, జెల్లీ చేపలు, సీ అనిమోన్లు, ప్రవాళ జీవులను ఈ వర్గంలో చేర్చడం జరిగింది.

వర్గం 5: టీనోఫోరా

వీటిని సాధారణంగా ‘కూంబ్ జెల్లీలు’ లేదా ‘కూంబ్ బేరర్స్’ అని కూడా అంటారు.

వీటిలో దాదాపు 90 జాతుల వరకు గుర్తింపబడ్డాయి. ఇవి ద్విపార్శ్వ సౌష్టవ, మరియు ద్వివలయ ద్విస్తరిత జీవులు. ఇవి కణాలలో నిర్మితమై ఉంటాయి. ఇవి ప్రస్తుతం ఉన్నప్పటికీ వీటికి ప్రత్యేకమైన అవయవ నిర్మాణ వ్యవస్థ లేదు. ఇవి 2 కంటకాలను 8 నిలువు వరుసలలో శైలికలతో కూడుకొని ఉన్న కూంబ్ ప్లేట్లను కలిగి గమనానికి ఉపయోగపడుతుంది. వీటిలో దంశకణాలుండవు. వీటిలో నీరు ఉంటుంది కాని పాయువు ఉండదు. ఇవన్నీ సముద్ర జీవులు మరియు స్వేచ్ఛగా ఈదే జంతువులు.

ఉదా: పూరో బ్రాంకియా; బెరో, టీనోప్లానా, సీలోప్లానా.

వర్గం 6: ప్లాటిహెల్మింథిస్

ఈ వర్గంలో సాధారణంగా బల్లపరుపు పురుగులు ఉంటాయి. గెగెన్ బార్ (1859) మొదటిసారిగా బల్లపరుపు పురుగులు అని అర్థం వచ్చే గ్రీకు పదాల నుంచి (ప్లాటిస్ బల్లపరుపు, హెల్మింథ్ = పురుగు) ప్లాటి హెల్మింథిస్ అనే పేరు పెట్టారు. ఈ వర్గ జీవులు ఆకు, రిబ్బన్ ఆకారంలో పృష్టోదరాలుగా అణిగి ఉంటాయి. కొన్ని స్వేచ్ఛా జీవులుగా నీటిలోనూ, తేమనేలపై జీవిస్తాయి. ఈ జీవులు ఎక్కువగా బాహ్య, అంతర పరాన్నజీవులుగా ఉంటాయి. దాదాపు 12,700 జాతుల జీవులను గుర్తించడం జరిగినది. శరీరం పృష్టోదరాలుగా అణిగి బల్లపరపుగా ఆకు ఆకారంలో లేదా రిబ్బన్ ఆకారంలో ఉంటుంది. ఆహారనాళం శాఖలుగాగాని లేదా లోపించి గాని ఉంటుంది. రక్తప్రసరణ వ్యవస్థ మరియు పాయువు లోపించి ఉంటాయి.

వర్గం 7: నెమర్జీనియా (OR) రింకోసీలా

వీటిని సాధారణంగా ‘రిబ్బన్ పురుగులు’ అంటారు. దాదాపు 900 జాతుల జీవులను గుర్తించారు.

శరీరం స్థూపాకారంలోగాని, కదురు ఆకారంలో ఉండి మృదువుగా, సాగే గుణం కలిగి ఉండి పృష్టోదర భాగాలు బల్లపరపుగా ఉండి శైలికలతో కూడిన పాయువును కలిగి ఉంటుంది.

వీటిలో ముఖతుండం బయటకు పొడుచుకొని వస్తుంది. జీర్ణనాళం పూర్తిగా అభివృద్ధి చెంది పాయువుతో అంతమవుతుంది.

రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.

వీటిలో ఎక్కువగా సముద్ర జీవులు. కొన్ని భూమిమీద మరియు మంచినీటిలోగాని జీవిస్తాయి. ఉదా: సెరాబ్రాటులన్; లీనియస్.

వర్గం 8: ఎకాంతోసెఫాలా

ఈ వర్గ జీవులను సాధారణంగా ముళ్ళతో కూడిన తల కలిగిన పురుగులు అని అంటారు.

వీటిలో దాదాపు 800 జాతులు జీవులను గుర్తించారు.

ఇవి అతిచిన్న పురుగులవలె ఉండి అంతర పరాన్నజీవులుగా ఉంటాయి.

వీటిలో జీర్ణవ్యవస్థ లోపించి ఉంటుంది.

ఉదా: ఎకాంతోసెఫాలస్, జైగాంటోరింకస్

వర్గం 9: ఎక్టోప్రాక్టా

వీటిని సాధారణంగా నాచు జంతువులంటారు.

వీటిలో దాదాపు 60 జాతుల వరకు గుర్తింపబడ్డాయి.

వీటి శరీరం పొడవాటి కాడను కలిగి ఉండి కేలిక్స్ను కూడా కలిగి ఉంటుంది. వీటిలో జీర్ణనాళం ‘U’ ఆకారంలో ఉంటుంది.

వీటిలో నోరు మరియు పాయువు ఒకదానితో ఒకటి కలసిపోయి స్పర్శకాలను

కలిగిన కిరీటంలాగా ఉంటుంది.

ఇవి వృంతరహితమైన సముద్ర జీవులు.

కొన్ని ఏకాంతంగాను మరియు సహనివేశంగా జీవిస్తాయి.

ఉదా – పెడిసెలినా; లోక్సోసోమా, యుర్నేటెల్లా.

అధివర్గం: ఆస్క్ హెల్మింథిస్

ఈ అధివర్గంలోని జీవులు సాధారణంగా స్థూపాకారంలో పొడవుగా ఉండి పురుగువలె ఉంటాయి. కాబట్టి వీటిని సంచి పురుగులు అనికూడా అంటారు.

సూడోసీలోమేట్లన్నీ కలసిపోయి పూర్వాంతంలో నోరును, పరాంతంలో పాయువును కలిగి పొడవైన ఆహారనాళాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ నీటి జీవనానికి అలవాటు పడినవే. ఇవి స్వేచ్ఛా పరాన్నజీవులు. వీటిలో 5 తరగతులున్నాయి.

అవి (1) రోటి ఫెరా (2) గాస్ట్రోపొడా (3) కైనోరింకా, (4) నెమటోడా (5) నిమాటోమార్పా.

వర్గం 10: రోటిఫెరా

ఈ వర్గంలోని జీవులను చక్రంలాగా కనిపించే జీవులు (వీల్ ఎనిమల్ క్యుల్స్) అని

అంటారు.

వీటిలో దాదాపు 2500, జాతులను గుర్తించారు.

ఇవి సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగల జీవులు

ఇవి ఎక్కువగా మంచినీటి జీవులు, కొన్ని సముద్ర జీవులు.

ఉదా॥ ఫలోడినా, రొటాటోరియా, హైడాటినా,

 వర్గం 11: గాస్ట్రోట్రైకా

వీటిని సాధారణంగా వెంట్రుకల లాంటి జీర్ణాశయం కలిగిన పురుగులు (Hairy stomach worms) అంటారు.

వీటిలో దాదాపు 3000 జాతుల వరకు గుర్తించారు.

ఇవి సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగల జీవులు.

వీటి పృష్ఠభాగం ఉపరితలంలో బల్లపరుపుగా ఉండి శైలికలను కలిగి ఉంటుంది. వీటి. చర్మం క్యూటికిల్ మరియు ముళ్ళ లాంటి నిర్మాణాలను లేదా ఫలకాలను లేదా పొలుసులను కలిగి ఉంటుంది.

ఇవి మంచినీటిలోను మరియు సముద్రనీటిలోను జీవిస్తాయి. 

ఉదా: కీటోనోటస్; మాక్రోడాసిస్.

వర్గం 12: కైనోరింకా

వీటిని సాధారణంగా కదిలే దవడలు కలిగిన పురుగులుగా పిలుస్తారు.

వీటిలో దాదాపు 100 జాతుల వరకు గుర్తించారు.

వీటి శరీరం ఖండితమైన క్యూటికిల్ను కలిగి వెనుక వంగిన ముళ్ళ వంటి నిర్మాణాలను కలిగి

ఉంటాయి.

పరాంత భాగం ముళ్ళ నిర్మాణంతో ఉంటుంది. ఇవన్నీ సముద్ర జీవులు. 

ఉదా|| ఎఖైనోడేరిస్; ఫింకో ఫైయిస్.

వర్గం 13: నిమటోడా

ఇవి క్రిముల లాంటి జీవులు. కొన్ని స్వేచ్ఛా జీవులు. కొన్ని పరాన్నజీవులు. శరీరంపై అవభాసిని ఉంటుంది.

పూర్వాంతంలో నోరు, పరాంతానికి కొంచెం పైకి పాయువుగాని, అవస్కరంగాని ఉంటుంది.

ఇవి ఏకలింగ జీవులు. లైంగిక ద్విరూపకత చూపిస్తాయి. మగజీవులు ఆడజీవులకంటే చిన్నవిగా ఉంటాయి. వీటిలో ప్రత్యక్షాభివృద్ధి జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page